ఆయిల్ టిన్నుల్లో అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు

69చూసినవారు
ఆయిల్ టిన్నుల్లో అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు
ప్రభుత్వ మద్యాన్ని అక్రమ మార్గాల్లో తరలించి సొమ్ము చేసుకునే అక్రమార్కులు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఆయిల్ టిన్నులో మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అవనిగడ్డ ఎస్ఐ కే. శ్రీనివాస్ తమ సిబ్బందితో బుధవారం సాయంత్రం తనిఖీలు చేశారు. అవనిగడ్డ నుంచి కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శ్రీను, గోవిందరాజులు రెండు ఆయిల్ టిన్నుల్లో వంద మద్యం సీసాలు తరలిస్తూ పట్టుబడ్డారు.

సంబంధిత పోస్ట్