డ్రైనేజీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపంతో కోడూరు మండల దిగువ ప్రాంతంలో అవుట్ పాల్స్ స్లూయిస్ ల వద్ద నుంచి ఉప్పునీరు యధావిధిగా ఎగువకు ప్రవహిస్తుంది. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న సమయంలో పాలకాయతిప్ప అవుట్ పాల్స్ స్లూయిస్ వద్ద తాత్కాలిక చర్యల్లో భాగంగా అవుట్ పాల్స్ గేట్లు లేని ప్రదేశంలో ఇసుక మూటలు వేసి ఉప్పునీరు ఎగువకు రాకుండా చర్యలు చేపట్టారు. రైతులు వాటిని తొలగించగా, సోమవారం ఉప్పునీరు పొలాల్లోకి వస్తుందన్నారు.