కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్ లపై ఉందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కోడూరులో వారు మాట్లాడుతూ, మండలంలోని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకుని ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి సహకరించాలని కోరారు. టీడీపీ నేతలు బండే శ్రీనివాసరావు, రావి రత్నగిరి తదితరులు పాల్గొన్నారు.