ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాల్సిందిగా ఎంపీపీ రావి దుర్గవాణి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మోపిదేవి, లంక గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఉపాధి హామీ పథకం గ్రామసభలు జరిగాయి. రాబోయే కాలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల వివరాలను ఏపీఓ ముత్యాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.