ఎదురెదురుగా వస్తున్న కారు - మోటార్ బైక్ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. మోపిదేవి మండలం పెద్దప్రోలు పంచాయతీ వారు కప్తానుపాలెం జాతీయ రహదారిపై నుంచి అవనిగడ్డ వెళ్తున్న మహీంద్రా కారు మోపిదేవి నుంచి చల్లపల్లి వెళ్తున్న మోటార్ బైక్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ కాళ్లు విరగగా, మరొకరికి గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో అవనిగడ్డ తరలించారు.