సముద్ర తీర ప్రాంతంలో కొత్త వ్యక్తులు, బోట్లు అనుమానస్పదంగా కనిపించినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని మెరైన్ సిఐ రావి సురేష్ రెడ్డి కోరారు. ఆదివారం నాగాయలంక మండలంలోని సొర్లగొంది, దీనదయాళపురం, నాచుగుంట, ఏసుపురం గ్రామాలలో సిఐ సురేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించి గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్త వ్యక్తులు గాని తారసపడిన వెంటనే కోస్టల్ సెసిబ్బందికి తెలియజేయవలసిందిగా సిఐ గ్రామస్తులకు సూచించారు.