గ్రామ సచివాలయాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

67చూసినవారు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగయతిప్ప గ్రామ సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అయినా ఖాళీగానే ఉద్యోగుల కుర్చీలు దర్శనమిస్తున్నాయి. కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే 12 గంటల సమయంలో సచివాలయం వద్ద ఉన్నారు. ఇదేమిటని ప్రశ్నించగా ఇద్దరు ఉద్యోగులు సెలవు, ఒకరు ఇప్పుడే పర్మిషన్ తీసుకుని వెళ్లారని గ్రేడ్ 5 కార్యదర్శి సమాధానం ఇచ్చారు. పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్లినట్లు ఎంపీడీవోకు తెలియకపోవడం విశేషం.

సంబంధిత పోస్ట్