అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్న నూతన మద్యం పాలసీని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి డిమాండ్ చేశారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రత్నకుమారి మాట్లాడుతూ మద్యం షాపుల సంఖ్య, సమయం కుదించాలని కోరారు. మద్యపానం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు.