కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా అవమానాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన మహాకవి అని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు కైతేపల్లి దాస్ అన్నారు. శనివారం గుర్రం జాషువా 129వ జయంతిని చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్రాంత ఈవోఆర్డీ దాసి సీతారామరాజు, బుల్లా కిషోర్, పాల్గొన్నారు.