గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో గురువారం విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ నుంచి రాబోయే విమానాలు నిర్దేశిత సమయానికి చేరుకోలేకపోయాయి. ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్న పొగమంచు ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.