కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో కొత్తదనం లేదని, స్వేచ్ఛకు వికాసం కలిగించే ఆ చట్టాలను తిప్పికొట్టాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక అట్లూరి శ్రీమన్నారాయణ మీటింగ్ హాలులో ఐలూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు ప్రజల హక్కుల పై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు.