గ్రామల అభివృద్ది బాధ్యత తాను తీసుకుంటా
గ్రామల అభివృద్ది బాధ్యత తాను తీసుకుంటానని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను వివరించి మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. ప్రజా వేదిక నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాలని ఆదేశించారు.