బుడమేరు కట్టతెగి ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాలు గురువారం జల దిగ్భంధనంలో చిక్కు కున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పొంగిన బుడమేరు, పిల్లికోడు పెద్దఆవుటపల్లి డ్రైయిన్, పిల్లికోడు (ఆనందపురం వద్ద డ్రెయిన్లలో వర్షపు నీరు భారీగా చేరి పంట పొలాలు, పరీవాహక ప్రాంతంలో పల్లపు ప్రాంతంలో ఉన్న ఇళ్ళు నీట మునిగాయి. వర్షం ఆగింది వరదనీరు తగ్గిపోతుందని భావించిన ప్రజలకు అనుకోని ఉపధృవం వచ్చిపడింది.