ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులైన, అధికారులైన ప్రజలకు జవాబుదారులుగా ఉంటూ వారికి మంచి చేసేందుకు పని చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టనంలోని పలు సమస్యలపై పురపాలక సంఘ శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆదివారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావడంలో జరుగుతున్న అలస్యంపై ఎమ్మెల్యే ప్రశ్నించారు.