గుడ్లవల్లేరు మండలం అంగళూరులో గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. అంగళూరు గ్రామానికి చెందిన కొమ్మలపాటి సాయి (26) కౌతవరం గ్రామంలో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. స్నేహితులు అతడిని గుడివాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.