నందివాడ మండలం జనార్ధనపురం గ్రామం పెద్ద హరిజనవాడలో డ్రైనేజీ పైప్ లైన్ లీక్ అయ్యి డ్రైనేజీ లోని మురుగు నీరు అంగన్వాడి కేంద్రాల్లోనికి రావడంతో తీవ్ర ఇబ్బందికరంగా మారిందని అంగన్వాడీ సిబ్బంది మంగళవారం వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి, తగు చర్యలు తీసుకొని ఈ మురుగు నీరును తొలగించి, శాశ్వత పరిష్కారం చూపించాలని అంగన్వాడీ సిబ్బంది కోరుతున్నారు.