మాజీ మంత్రి, వైసిపి నాయకులు పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలని జన సైనికులు డిమాండ్ చేశారు. ఆదివారం గుడివాడ పట్టణానికి పేర్ని నాని విచ్చేసిన విషయాన్ని తెలుసుకున్న జనసైనికులు స్థానిక వైసీపీ నాయకుడు తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకొని పేర్ని నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.