

సిద్ధాంతం: ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామం వద్ద గురువారం గుడ్లవల్లేరు వైపు నుంచి వస్తున్న ఓ ఆటోను వెనకవైపు నుంచి వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ఆటో పల్టీ కొట్టి పక్కకు దూసుకుపోయింది. ఆటోలో ఉన్న డ్రైవర్ బాబురావుకు తీవ్ర గాయాలు కావడంతో గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే బాబురావు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.