కోటి రూపాయాలు నష్టపరిహారం చెల్లించాలి
జగ్గయ్యపేట మండలం జయంతి పురం సమీపంలోనిరాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అశువులు బాసిన మూఢవతు నాగులు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం చూస్త్తుంటే అధికారులు నిద్రపోతున్నారన్నారు.