ఏలూరు జిల్లాలో లబ్ధిదారులకు నవంబరు 1 నుంచి పింఛన్లు పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. వెట్రి సెల్వి ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 31న దీపావళి సందర్భంగా సెలవు కావడంతో 30న బ్యాంకుల నుంచి సొమ్ము తీసి 1న పంపిణీ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. అలాగే లబ్ధిదారులు ఏ నెల పింఛను సొమ్ము ఆ నెలలోనే పొందాలన్నారు.