కైకలూరు ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైనా చెక్కులను లబ్దిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 7 లక్షల విలువగల చెక్కులను పలువురు లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.