నీట మునిగిన రహదారి, రాక పోకలు బంద్

57చూసినవారు
మండవల్లి మండలంలోని పెనుమాకలంక, పెద్దఎడ్లగాడి రహదారి ముంపు బారిన పడింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపు తీవ్రంగా ఉన్నందున ఆ నీరంతా డ్రైన్ల ద్వారా కొల్లేరు సరస్సులోనికి చేరడంతో లంక గ్రామాలకు వెళ్లే రహదారి బుధవారం ఉదయం నాటికే పూర్తిగా నీట మునిగింది. పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక, శ్రీరామ్ నగర్, మణుగులూరుకు వరద పొంచి ఉండటంతో కొల్లేరు గ్రామాల్లో ప్రజలు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్