కేసుల్లో పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అన్నారు. గురువారం మచిలీపట్నంలో నెలవారి నేర సమీక్ష సమావేశంలో అధికారులకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పురోగతి సాధించి, బాధితులకు సత్వర న్యాయమందించే దిశగా ప్రణాళికల రూపొందించాలన్నారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించవద్దని పోలీసులకు హితవు పలికారు.