శిక్షణ తరగతులకు 11 మంది సభ్యులు గైర్హాజర్

1537చూసినవారు
శిక్షణ తరగతులకు 11 మంది సభ్యులు గైర్హాజర్
స్థానిక ఎస్సీ,ఎస్టీ బాలుర వసతి గృహంలో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన గ్రామ వాలంటీర్ల కు మొదటి రోజు నిర్వహించిన శిక్షణ తరగతులకు 11 మంది గైర్హాజర్ అయినట్లు ఎంపిడిఒ పి.అనురాధ తెలిపారు.ఆగష్టు 5వ తేదీ మొదటి,రెండవ బ్యాచ్ లలో కోడూరు,చిన నందిగామ, వెల్లటూరు, కందులపాడు హెచ్.ముత్యాలంపాడు,ఆత్కూరు,కుంటముక్కల,చెవుటూరు,జి.కొండూరు గ్రామాలకు చెందిన 153 మంది గ్రామ వాలంటీర్ల కు గాను 11 గ్రామ వాలంటీర్లు శిక్షణా తరగతులకు హాజరు కాలేదన్నారు.మండల ఈఒపిఆర్డి జి.రాధిక,పంచాయితీ కార్యదర్శులు రమణ బి.వెంక టేశ్వరరావు,వ్యవసాయ అధికారి ఎం.రామ్ కుమార్ ల తో పాటు వివిధ శాఖా అధికారులు గ్రామ వాలంటీర్లు నిర్వర్తించాల్సిన విధి విధానాలు గురించి అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్