జి.కొండూరు సెంటర్ లో బాలామృతంపై అవగాహన

327చూసినవారు
జి.కొండూరు సెంటర్ లో బాలామృతంపై అవగాహన
జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఐసిడిఎస్ మైలవరం ప్రాజెక్ట్ పరిధిలోని జి.కొండూరు సెక్టార్ సూపర్ వైజర్ ఇందుపల్లి అన్నమ్మ ఆధ్వర్యంలో జి.కొండూరు బిసి ఏరియా జి.కొండూరు-1సెంటర్ కోడ్ నెంబర్ 212 అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం బాలామృతంపై అవగాహన సదస్సు జరిగింది. సూపర్ వైజర్ అన్నమ్మ అంగన్ వాడీ కార్యకర్త బి.వాణితో కలిసి గర్భిణి స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. బాలామృతం యొక్క ప్రాముఖ్యత, దీని ద్వారా లభించే విటమిన్ల గురించి వివరించారు. స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టి రెండేళ్లు వచ్చే వరకు తల్లీ, బిడ్డలకు అందించే వివిధ రకాల పోషక పదార్ధాలతో కూడిన నమూనా చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ ఆయా గంగమ్మ, కేంద్రం పరిధిలోని గర్భిణి స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్