జి కొండూరు.. రైతులు కలుపు నివారణ మందులను పిచికారీ చేసే సమయంలో అజాగ్రత్తగా ఉంటే.. పక్కనే ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మైలవరం ఏడీఏ బి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని మునగపాడు గ్రామ శివారు ఫామాయిల్ తోటలో ఓ రైతు కలుపు నివారణ మందును పిచికారీ చేయడంతో.. పక్కనే సాగు చేస్తున్న యన్నం జనార్ధన్‌రెడ్డికి చెందిన 8 ఎకరాలలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పత్తి పంటను బుధవారం ఏడీఏ వెంకటే శ్వరరావు, స్థానిక ఏఓ ఎం రాంకుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మట్లాడుతూ.. కలుపు మందు ప్రభావంతో నష్టం జరిగిన పంట దిగుబడి తీవ్రంగా పడిపోతుందన్నారు. మొక్కలలో ఎదుగుదల లోపించి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నారు. రైతులు కలుపు మందులను పిచికారీ చేయాలనుకుంటే వ్యవసాయ అధికారుల సూచనల, సలహాలను తప్పని సరిగా పాటించాలని వెల్లడించాడు. కార్యక్రమంలో ఎంపీఈఓలు, రైతులు పాల్గొన్నారు.