గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు సంబంధించి నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం నుంచి మంజూరు అవుతున్న నిధుల వినియోగంపై థర్డు పార్టీ విచారణ అధికార బృందం మంగళవారం జి కొండూరులో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ కి చెందిన ఝాన్సీ, రూప స్థానిక పశువైద్యశాలను సందర్శించారు. అప్పటికే అక్కడకు వచ్చిన గొర్రెలు, మేకల పెంపకందారులతో మాట్లాడారు. అనంతరం నట్టల నివారణ కార్యక్రమాలపై వారిలో కొంత మంది అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద ప్రభుత్వం ఎంతమేర నిధులు మంజూరు చేస్తుంది..నిధుల వినియోగం తదితర అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య శాఖా సహాయ సంచాలకులు డా జెడ్ శ్రీనివాసరావు, డా కె రాధాకృష్ణ మూర్తి, స్థానిక పశువైద్య అధికారి ప్రమీల రాణి, గొర్రెలు, మేకల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు కందుల యేసు రాజు,సంఘసభ్యులు పాల్గొన్నారు.