ఇబ్రహీంపట్నంలో బూడిద దోపిడి పై ఫిర్యాదు

64చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో బూడిద వల్ల ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కొందరు నాయకులు, బూడిదను దోపిడీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెప్పారు. ఈ బూడిద కళ్ళల్లో పడి కానిస్టేబుల్ సైతం అనారోగ్యం పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక దోపిడీ జరుగుతూనే ఉందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్