రైతు భరోసా పథకాన్ని రైతులు సద్వినియోగించుకోండి: ఏడీఎ

2392చూసినవారు
రైతు భరోసా పథకాన్ని రైతులు సద్వినియోగించుకోండి: ఏడీఎ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలనే సంకల్పంతో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా మండలంలో రైతు భరోసా గ్రామ సభలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయితీ కార్యాలయాలలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు.. మండల వ్యవసాయ అధికారి ఎం రామ్ కుమార్ తెలిపారు. బుధవారం కుంటముక్కల, గుర్రాజుపాలెం, వెంకటాపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన రైతు భరోసా గ్రామ సభలకు మైలవరం ఎడిఏ బి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 12,500ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. అయితే పీఎం కిసాన్‌ పథకం కింద వెబ్‌ల్యాండ్‌ సమాచారం ఆధారంగా అర్హులైన భూయజమానుల కుటుబాలను వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకంలో గుర్తిస్తారన్నారు. ఈ పథకం కింద వచ్చే ఆర్థిక సాయాన్ని ఎస్పీ, ఎస్టీ , బీసీ మైనార్టీల లో భూమిలేని కౌలు రైతులకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ సాగుదారులు, కౌలుదారులు మాత్రమే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందటానికి అర్హులని పేర్కొన్నారు. భూమిలేని కౌలు రైతుల వివరాలను సంబంధిత పత్రాల ఆధారాలను, గ్రామవాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి సేకరిస్తారని తెలియజేశారు. పథకంలో నమోదు కోసం రైతులు ఆధార్‌ కార్డు, భూమి పాస్‌ బుక్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు వివరాలు, ఫోన్‌ వివరాలతో గ్రామ వాలంటీర్లను సంప్రదించాలి కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో, ఎంపిఈఓ, పంచాయితీ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్