కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు- సిఐటియు కార్యదర్శి శ్రీనివాస్

320చూసినవారు
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు- సిఐటియు కార్యదర్శి శ్రీనివాస్
కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సిఐటియు పచ్చిమ కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం సిఐటియు మండల కమిటీ సభ్యులు పంది సాంబశివరావు అధ్యక్షతన మండల మహాసభ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలు కుదింపు, కార్మిక హక్కుల తొలగింపును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులకు సంబంధించి 13 రకాల కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగిందనీ, వీటిలో ఫ్యాక్టరీ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, బిల్లింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ చట్టం, రవాణా కార్మికుల చట్టం, గనుల చట్టం, రాష్ట్ర వలస కార్మికుల చట్టం, జర్నలిస్ట్ వేతనం నిర్భయ చట్టం, కనీస వేతన చెల్లింపు చట్టం, సమాన వేతనం చట్టం, బోనస్ చట్టం తదితర చట్టాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు కార్యాలయం ఎదుట సిఐటియు జెండాను పచ్చిగోళ్ల శాంతమ్మ ఎగురవేశారు. అనంతరం మహాసభ లో సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షురాలుగా పి. శాంతమ్మ, ప్రధాన కార్యదర్శిగా కె బాలకృష్ణ, ఉపాధ్య క్షులుగా హేనా, సంయుక్త కార్యదర్శిగా, ఇ ఎస్ కే ఖాదరవలి,ఆర్.వెంకటేశ్వరరావులు, కోశాధికారిగా సునీత, కమిటీ సభ్యులు సూరయ్య, కోటయ్య, కృష్ణవేణి, కిషోర్, మల్లేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు ఎ. కమల, పి.శంకర్, ఆటో వర్కర్స్ , బిల్లింగ్ వర్కర్స్ ,ఆశ, అంగన్ వాడి కార్యకర్తలు, సెకండ్ ఏఎన్ఎంలు, బిపిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్