తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం విసన్నపేట మండలం తాతగుంట్ల కోడిపందేల్లో బుల్లెట్ పై చక్కర్లగొట్టారు. కోడి పందేలు వీక్షించేందుకు విచ్చేసిన అభిమానులకు బుల్లెట్ నడుపుతూ అభివాదం చేశారు. దీంతో ఈ కోడిపందాలలో ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన అన్నారు.