బిసి కాలనీలో కొండచిలువ కలకలం

1743చూసినవారు
బిసి కాలనీలో కొండచిలువ కలకలం
మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామం బిసి కాలనీలో గత కొన్ని రోజులుగా కొండచిలువ సంచారం కాలనీ వాసుల్లో కలకలం సృష్టిస్తోంది. కాలనీకి ఆనుకొని ఉన్న దొర్లింతల వాగుకు రెండు వైపులా ఉన్న ముళ్ల పొదలను నివాసంగా చేసుకొని మాటువేసి రాత్రివేళ ఇళ్లలోకి చొరబడి కోళ్లను కాజేస్తుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కొండచిలువతో తమకు ప్రాణాపాయం పొంచి ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువ నుంచి తమను కాపాడాలని కాలనీ వాసులు గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారి, ఎంపిడిఒ పి.అనురాధ కు, కార్యదర్శి రమణకు, గ్రామంలోని వైకాపా నాయకుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో గురువారం ఉదయం ఎంపిడిఒ అనురాధ పంచాయితీ కార్యదర్శి రమణ, సిబ్బందితో కలిసి దొర్లింత వాగు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ముందుగా వాగుకు రెండు వైపుల ఉన్న ముళ్ల పొదలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పులిపాక థామస్, వేములకొండ శ్రీనివాసరావు, నారే ప్రసాద్, బట్టపర్తి శేఖర్ బాబు, పజ్జూరు తిరుపతిరావు, పజ్జూరు శ్రీకాంత్ తో పాటు కాలనీ వాసులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

స్మశానాన్ని తలపిస్తున్న భవాని ద్వీపం.. http://bit.ly/2HkLG1J క్లిక్ చేయండి

రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా బెదిరిస్తున్నారు: మాజీ మంత్రి http://bit.ly/2ZmYX3Q క్లిక్ చేయండి

ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్