ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

1073చూసినవారు
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
బుడమేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. వెల్లటూరు గ్రామ శివారు భీమవరప్పాడు గ్రామం పక్కనే ఉన్న బుడమేరు నుంచి మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన బండారు నాగరాజు, పీట్ల శివ లక్ష్మయ్యలు ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో దాడులు నిర్వహించామని ఎస్ఐ రాంబాబు తెలిపారు. వెంటనే సిబ్బందితో కలిసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నామన్నారు. ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్