నాగాయలంక: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు నాగాయలంక మండలం తలగడదీవి జెడ్పి పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయులు బండ్రెడ్డి శివ రామప్రసాద్ తెలిపారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 8వ తరగతి విద్యార్థిని తోట కీర్తన, 9వ తరగతి చదువుతున్న చిక్కాల బాలవంశీలు జూనియర్ విభాగం కబడ్డీ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.