జయంతి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

998చూసినవారు
జయంతి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
వీరులపాడు మండలం జయంతి గ్రామంలో పశు సంవర్థక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశు వైద్యులు డా. సుమంత్ రెడ్డి, డా. జస్వంత్ రెడ్డి పాడి పశువులకు పరీక్షలు నిర్వహించి చూడి, తిరగకట్టడం, చర్మ వ్యాధులు తదితర సమస్యలకు వైద్యం చేసి ఉచితంగా మందులు, మినరల్ మిక్చర్, కాల్షియం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్