ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలను అన్నివర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఆదివారం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన గ్రామ ఎంపీటీసీ చిలకమ్మ నాగుల్ నాయక్ కొండా నాయక్ వెంకటరమణ నాయక్ సైదా లను పార్టీ కండువా కప్పి కూటమి నేతలతో కలిసి పార్టీలోకి సౌమ్య ఆహ్వానించారు.