ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరం అని నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. శనివారం నందిగామ పట్టణం ఎనిమిదవ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలసి పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు స్వయంగా అందజేసారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు.