వెంటనే మరమ్మతులు చేపట్టాలి: సైదులు

83చూసినవారు
నందిగామ పట్టణ పరిధిలోని సోమవారం కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓకి కౌలు రైతు సంఘాలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి సైదులు మాట్లాడుతూ. నీటిపారుదల శాఖ వెంటనే స్పందించి వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్