ప్రమాదకరంగా మారిన నూజివీడు బైపాస్ రోడ్డు

79చూసినవారు
నూజివీడు పట్టణానికి అతి సమీపంలోని బైపాస్ రోడ్డు రోజురోజుకి ప్రమాదపదంగా మారింది. ఇటీవల నూజివీడు పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రతాప్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. దీనిపై విచారణ చేయాలని ఇటీవల అతని భార్య నూజివీడు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ముసునూరు వెళ్లే బైపాస్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ పోలీస్ ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్