నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని తమ్మినేని పరివాహ ప్రాంతం శనివారం వరద నీటి ఉధృతిలో ప్రవహిస్తుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరులో వర్షపు నీరు వచ్చి పడింది. దీంతో మండల పరిధిలోని లోపూడి నుండి రంగంపేట, బలివే గ్రామాల మీదగా తమ్మిలేరు వరదనీటిలో పరవళ్ళు తొక్కుతోంది. బలివే తమ్మిలేరుపై నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.