ఇటీవల పెడనలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణ జరిపేందుకు బందరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్ పెడనకు సోమవారం వచ్చారు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు సూచన మేరకు అశోక్ కుమార్ పెడనలో ఈ పర్యటన జరిపారు. గొడవలకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా అశోక్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యంలో అన్ని మతాలవారు కూడా ఐక్యంగా మెలగవలసిన అవసరం ఉందన్నారు.