పెడన: మహాత్మా గాంధీ కలలు నెరవేరుస్తున్న ప్రభుత్వం

79చూసినవారు
పెడన: మహాత్మా గాంధీ కలలు నెరవేరుస్తున్న ప్రభుత్వం
మహాత్మా గాంధీ కలలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేటలో సిసి రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్