పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి బుడమేరు, వన్నేరు కాల్వలకు బుధవారం గండి పడింది. దీనితో వరద నీరు ఉధృతంగా రావడంతో ప్రధాన రహదారిలోకి వరద నీరు చేరటమే కాకుండా ఎస్సీ, బీసీ కాలనీలు జలదిగ్బంధంలో చుక్కుకున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.