కంకిపాడు మండలం ఈడుపుగల్లు బిసి కాలనీ సమీపంలో కాలువకట్ట రోడ్డు అభివృద్ధికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు రూ.40లక్షల వ్యయంతో సీసీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజాతో పాటు సర్పంచ్ పందిపాటి ఇందిర, మండలం పార్టీ అధ్యక్షుడు సుదిమళ్ళ రవీంద్ర, నేతలు షేక్ షకార్, పందిపాటి సుధాకర్, కొట్టెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.