యువకుల మధ్య కొట్లాట ఒకరికి తీవ్ర గాయాలు ఆయన ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉయ్యూరు మండలం మూర్తిరాజుగూడెం డొంక రోడ్డులో యువకుల మధ్య కొట్లాట జరిగింది.
తేజ అనే యువకుడు రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టాడు. దీనితో కారులో ఉన్న యువకులు తేజపై మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం మత్తులో ఇష్టానుసారంగా తేజపై దాడి చేయడంతో తేజ తలకు బలమైన గాయమైంది.