పెనమలూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కంకిపాడులో అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జూద శిబిరం మంగళవారం కాళీ అయింది. విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారికి సమీపంలోని చైతన్య టెక్నో స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన కోడిపందాల బరివైపు ప్రజలు కన్నెత్తి చూడటం లేదు. దొంగ పందాలు, గొడవలతో మంగళవారం పండగ రోజే ఖాళీ అవటం పట్ల స్థానికులు పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.