పెనమలూరు మండలం యనమలకుదురు, పెదపులిపాక గ్రామాలలో బుధవారం కృష్ణానది వరద ముప్పు ప్రాంతాలలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ కే. శ్రీనివాసులు పర్యటించారు. ముప్పు ప్రాంతాలలో వరద వల్ల నష్టపోయిన ఉద్యాన పంటలు అరటి, పసుపు, కంద ఇతర కూరగాయలు, తోటలను సందర్శించారు. ఈ సంద్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకోవటం జరిగినది.