ఏటీఎంలో డబ్బులు తీసి ఇస్తానని నమ్మబలికి 40 వేల రూపాయలు తస్కరించిన సంఘటన బుధవారం పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఉయ్యూరు స్టేట్ బ్యాంక్ ఎటిఎంలో ఘరానా మోసంతో గుర్తు తెలియని వ్యక్తి 40 వేల రూపాయలతో ఉడాయించాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి కోసం ఉయ్యూరు పట్టణ పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే బాధితుని బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేశారు.