పెనమలూరు: కసబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
సబ్ స్టేషన్ నిర్వహణ, విద్యుత్ లైన్ల మరమత్తుల కారణముగా కాటూరు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఉ య్యూరు డివిజన్ ఇంజనీర్ డి. కృష్ణ నాయక్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకుకాటూరు, రాజుపేట, కడవకొల్లు, పొట్లపాడు, వీరవల్లి, కలవపాముల గ్రామాల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాని నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.