తిరువూరు నియోజకవర్గం ఎ. కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. డయాలసిస్ పేషంట్స్ కోసం సదుపాయాలు సక్రమంగా పని చేస్తున్నాయా, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, రోగులకు సకాలములో వైద్యం అందిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. డయాలసిస్ పేషంట్స్ యొక్క సంఖ్య, వారికి అందిస్తున్న వైద్యం గురించి వివరాలు కూడా తెలుసుకున్నారు.